శ్రీ దేవి ఒత్తిడిని జయించలేకపోయింది

Sri Devi could not conquer the pressure

Sri Devi could not conquer the pressure

Date:26/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
శ్రీ దేవికి యాభై నాలుగేళ్లు. ప్రస్తుత జీవన ప్రమాణాల ప్రకారం చూస్తే అదేం పెద్ద వయస్సు కాదు. ఆమె నిత్యం యోగా చేస్తుంది. చురుగ్గా కనిపిస్తుంటుంది. గుండె జబ్బున్నట్లు గత వైద్య పరీక్షల్లో ఎన్నడూ తేలలేదు. కానీ, హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అందర్నీ హతాశుల్ని చేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.‘శ్రీదేవి సర్జరీలు చేయించుకుని బరువు తగ్గలేదు. తన కుమార్తె తొలి చిత్రం ఎలా ఉండబోతుందోననే స్ట్రెస్‌ ఆమెలో ఎక్కువగా ఉంది. జాన్వి ఎలా చేస్తుందో.. ఎలా చేయగలుగుతుందో.. అనే టెన్షన్‌ శ్రీదేవిలో ఎక్కువగా ఉంది’ అని బాలీవుడ్‌లో శ్రీదేవి సన్నిహితులు అంటున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా నటించే అవకాశం తొలుత శ్రీదేవికే వచ్చింది. కానీ దాన్ని చేజేతులా జారవిడుచుకోవడం, ఆ చిత్రం పెద్ద హిట్‌ కావడం కూడా ఆమెను మానసికంగా కాస్త ఇబ్బందికి గురిచేశాయి. దానికితోడు ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తమిళంలో నటించిన ‘పులి’ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడింది. శ్రీదేవి మరణానికి కారణమేమై ఉంటుందనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. తన భావోద్వేగాలను బయటపెట్టకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా ఉన్నట్టు కనిపించడం శ్రీదేవికి చిన్నప్పటి నుంచీ అలవాటు. నాలుగైదు రాష్ట్రాలు, ఎన్నో భాషలు, అన్నేసి సంస్కృతులు, ఇంకెన్నో రకాల పరిస్థితులు, మరెన్నో వ్యక్తిత్వాలు ఆమెకు సుపరిచితమే. క్లిష్ట పరిస్థితుల్లో సైతం భావోద్వేగాలను బయటికి పొక్కనీకుండా జాగ్రత్త పడేది. ఆ అలవాటే ఆమెను మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఉంటుందని భావిస్తున్నారు. అందం మీద ఆరాటం, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, ఏ విషయాన్నీ బయటకు పొక్కనివ్వని మనస్తత్వం… ఇవన్నీ శ్రీదేవి జీవితానికి శాపంగా మారాయని అంచనా వేస్తున్నారు. 15 శాతం కార్డియాక్‌ అరెస్టులకు మానసిక ఒత్తిడి, కుంగుబాటులే కారణమని వైద్యులు చెబుతున్నారు.శ్రీదేవి పర్ఫెక్ట్‌నె్‌సకు మరో పేరు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆమె అంటే ఇష్టం. ముక్కుపచ్చలారని ప్రాయంలోనే మెగాఫోన్‌ ముందు నిలుచుంది. తోటి పిల్లలు మాతృభాషలో కూడా మాటలు నేర్వని ప్రాయంలోనే శ్రీదేవి పొరుగు భాషల్లోనూ మాట్లాడింది. బాలీవుడ్‌లో అడుగు పెట్టే వరకూ ప్రతీక్షణం ఆమె తల్లి రాజేశ్వరి వెన్నంటే ఉంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? పూసగుచ్చినట్టు నేర్పించేది. రాజేశ్వరి ఉన్నంత వరకూ శ్రీదేవి తల్లి కొంగుచాటు అమ్మాయే. సినిమా అంటేనే గ్లామర్‌ ఫీల్డ్‌. మనిషి ముక్కు సూటిగా ఉండకూడదు. ముక్కు మాత్రం అందంగా ఉండాలి. మనసులో మాట పెదాలు దాటకూడదు. నవ్వు మాత్రం పెదాలమీద మరింత అందంగా తళుకులీనాలి. ఇండస్ట్రీ నేర్పిన పాఠాలతోనే ఆమె ముక్కును ఆపరేషన్‌ ద్వారా తీర్చిదిద్దుకొంది. తర్వాత కూడా అందాన్ని ఇనుమడింపజేసే పలు శస్త్రచికిత్సలను చేయించుకుంది. బాలీవుడ్‌లో ‘హిమ్మత్‌వాలా’తో శ్రీదేవి పెద్ద హిట్‌ అందుకుంది. తర్వాత కూడా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలు. అంతలోనే మిథున్‌ చక్రవర్తితో పెళ్లి వ్యవహారం.. తూచ్‌ అని అనడం, అప్పటికే పెళ్లయిన బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా శ్రీదేవి ఆహార్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఎప్పుడూ మంచి ఛాయతో కనిపించాలని ఆరాటపడింది. రీ ఎంట్రీ చిత్రం ‘ఇంగ్లిష్‌ వింగ్లి్‌ష’లో ఆమెను చూసిన వారంతా అవాక్కయ్యారు. ‘నిజంగానే అతిలోక సుందరి శ్రీదేవి’ అని కితాబిచ్చారు. బాలీవుడ్‌ గుసగుసల ప్రకారం ఆ సినిమా కోసం శ్రీదేవి రెండు సర్జరీలు చేయించుకుంది.అందుకే ఆమె అంత బాగా తెరపై మెరిసిందనే వార్తలు వచ్చాయి. తర్వాతి చిత్రం ‘మామ్‌’. అందులో దవడ ఎముకలు కనిపిస్తూ, కళ్లు లోపలికి పీక్కునిపోయి కనిపించిందామె. ‘పాత్ర డిమాండ్‌ మేరకే అలా కనిపించాను. ఆ పాత్రకు నున్నటి మేని మెరుపులు అవసరం లేదు’ అని విలేకరులకు సమాధానమిచ్చింది. అందులో నిజం లేదన్నది ఒక వాదన. అంతకుముందు చేయించుకున్న సర్జరీ తాలూకు ప్రభావం తగ్గిపోయి అలా కనిపించిందని అంతా అన్నారు. దాంతో ఆమెలో ఒత్తిడి మొదలైంది. ‘నేను దేనికీ అంత తేలిగ్గా సంతృప్తి చెందను’ అని శ్రీదేవి గతంలో ఓ సారి చెప్పిన మాటల్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. శ్రీదేవి అందం విషయంలో రాజీపడలేదు. బరువు పెరగకూడదనే ఉద్దేశంతో భోజనం చేయకుండా విటమిన్ల మీద ఆధారపడి కూడా జీవించిందట. దానికి తోడు ఇటీవలే వెయిట్‌లాస్‌ సర్జరీ చేయించుకున్నట్టు కూడా మరో వార్త వినిపిస్తోంది. బాలీవుడ్‌ తారలతో అత్యంత సన్నిహితంగా మెలిగే పియాలీ గంగూలీ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. శ్రీదేవిపై బరువు తగ్గాలన్న ఒత్తిడి అధికంగా ఉందని తెలిపారు. 54 ఏళ్ల వయస్సులో మడతలేని చర్మంతో నలభై ఏళ్ల లోపు మహిళలాగా కనబడాల్సిన ఒత్తిడి ఆమెను సర్జరీలకు పురిగొల్పిందన్నారు. ఐదేళ్ల క్రితం తానామెను కలిసినపుడు ఎంతో అందంగా ఉన్నప్పటికీ ఆమెలో అంతులేని దిగులు తొంగి చూస్తోందని చెప్పారు. శ్రీదేవి తరచూ దక్షిణ కాలిఫోర్నియాలోని క్లీనిక్‌లను సందర్శించేదని చెప్పారు.
Tags; Sri Devi could not conquer the pressure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *