అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం

-ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

Date:13/01/2021

తిరుప‌తి ముచ్చట్లు:

పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 141 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ గోదాదేవి(ఆండాళ్‌), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం  శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు.  వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.       అనంత‌రం తిరుప‌తికి చెందిన ఎం.భానుజ బృందం గోదాదేవిపైన నృత్య‌రూప‌కాన్ని చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు.అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు బుధ‌వారం ముగిశాయి. తిరుపతికి చెందిన  చక్రవర్తి రంగనాథన్‌ ఇక్కడ తిరుప్పావై  ప్రవచనాలు వినిపించారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Sri Godakalyanam is richly in the Annamacharya Art Gallery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *