జూలై 29న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29వ తేదీ శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర ఘనంగా నిర్వహించ‌నున్నారు.ఈ సందర్భంగా ఉదయం తిరుమల నుంచి శ్రీవారి అప్పాపడి ప్రసాదాన్ని తిరుప‌తిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి సాత్తు మొర నిర్వ‌హిస్తారు.

ప్రాశస్త్యం :

శ్రీ ప్రతివాది భయంకర అన్నన్‌ కాంచిపురంలో జన్మించారు. ఆయన సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతాన్ని, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. అంతేగాక శ్రీ భాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీ.

 

Tags: Sri Govindarajaswamy Temple on 29th July by Sri Bhaiyakaran Annan Sathumora.

Leave A Reply

Your email address will not be published.