శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Sri Govindarajaswamy's Brahmotsavala wallpapers are discovery

Sri Govindarajaswamy's Brahmotsavala wallpapers are discovery

Date:05/05/2019
తిరుమల ముచ్చట్లు :

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో  బి.ల‌క్ష్మీకాంతం ఆదివారం తిరుపతిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఆవిష్కరించారు.

 

 

 

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు మే 10న అంకురార్పణ జరుగనుంద‌న్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసి వాహనసేవలను తిలకించాలని కోరారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తామన్నారు.

 

 

 

 

    తేదీ         

11-05-2019  ధ్వజారోహణం పెద్దశేష వాహనం

12-05-2019  చిన్నశేష వాహనం హంస వాహనం

13-05-2019  సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

14-05-2019 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

15-05-2019  మోహినీ అవతారం గరుడ వాహనం

16-05-2019  హనుమంత వాహనం గజ వాహనం

17-05-2019  సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

18-05-2019  రథోత్సవం అశ్వవాహనం

19-05-2019  చక్రస్నానం ధ్వజావరోహణం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి స్థానికాల‌యాల ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌నివాస వాఙ్మ‌య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా.. మేడ‌సాని మోహ‌న్‌, ఏఈవో  ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

చెరువులు, కుంటల్లో నీరు రాలేని దుస్థితి

Tags:Sri Govindarajaswamy’s Brahmotsavala wallpapers are discovery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *