పుంగనూరులో శ్రీ హనుమ జయంతి వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
శ్రీ హనుమ జయంతి వేడుకలను ఆంజనేయస్వామి ఆలయాల్లో బుధవారం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మండలంలోని అరవపల్లె రోడ్డులో గల పురాతన అభయ ఆంజనేయస్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమాలను అరవపల్లె, సింగిరిగుంట, మార్లపల్లె గ్రామస్తులు నిర్వహించారు. అలాగే సుబ్బమ్మ చెరువు వద్ద, గూడూరుపల్లె, కోనేటి వద్ద, రాంపల్లె బైపాస్ రోడ్డు వద్ద గల ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అభయ ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు , భోజన కార్యక్రమాలు నిర్వహించారు.

Tags: Sri Hanuman Jayanti celebrations in Punganur
