శ్రీ వారి దర్శనానికి 16 గంటలు

Sri is 16 hours for their vision

Sri is 16 hours for their vision

Date:16/04/2018
తిరుమల  ముచ్చట్లు:
తిరుమలలో శ్రీవారికి దర్శనానికి భక్తులు అనూహ్యంగా పోటెత్తారు. వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్‌ పూర్తిగా నిండిపోయి, బయట కిలోమీటర్ల మేర భక్తులు నిలబడి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇటీవలే పదో తరగతి పరీక్షలు ముగియడం, ఇంటర్ ఫలితాలు వెల్లడి కావడంతోపాటు తమిళ నూతన సంవత్సరాది ‘పుత్తాండు’ వల్ల ఆదివారం రాత్రి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిపోయింది. కాలినడక భక్తుల దివ్య దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నామని, వారికి అన్న పానీయాలను అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్ శ్రీవారి భక్తులపై ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం దర్శనం అనంతరం కొండ దిగివచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని పలువురు వాపోయారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు మినహా మరే ఇతర సర్వీసులు నిలిచిపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. శనివారం శ్రీవారిని 88 వేల మంది దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్ల మేర లభించింది. ‘పుత్తాండు’ పుత్ అంటే కొత్త, నూతన – ఆండు అంటే సంవత్సరం.. మన పంచాంగం సూర్యమానం ప్రకారం గణించబడుతుంది కాబట్టి మనకు ఉగాది నాడు, తమిళులు మళయాళీల పంచాంగాలు చంద్రమానం ప్రకారం గణించబడతాయి కాబట్టి మన ఉగాది తర్వాత వారికి కొత్త సంవత్సరాదులు వస్తాయి.
Tags:Sri is 16 hours for their vision

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *