పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి  వైభవం 

Sri Jayalakshaswamy's grandeur on the flower palli

Sri Jayalakshaswamy's grandeur on the flower palli

Date:17/07/2018
తిరుమల ముచ్చట్లు:
ఆణివార ఆస్థానం సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పల్లకీ ముందువైపు శ్రీ మహావిష్ణువు, ఇరువైపులా చిన్ని కృష్ణులు, మధ్యలో ఒకవైపు పండరీపురం శ్రీ పాండురంగస్వామివారు, మరొకవైపు ద్వారక కృష్ణుడు, వెనుకవైపు శ్రీ ఆంజనేయస్వామివారి సెట్టింగులను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా రోజాలు, చామంతి, లిల్లి, మొలలు, మల్లి, కనకాంబరం, తామరపూలు, వృక్షి తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు, 5 రకాల కట్ ఫ్లవర్స్ను వినియోగించారు. అదేవిధంగా వివిధ సాంప్రదాయ పుష్పలు, కట్ ఫ్లవర్స్తో విశేష అలంకరణలు చేశారు. టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్  శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 15 మంది ఉద్యానవనశాఖ సిబ్బంది వారం రోజుల నుండి పుష్పపల్లకీని రూపొందించారు. తమిళనాడులోని సెలంకు చెందిన దాత  మణిశంకర్ శ్రీవారి పుష్పపల్లకీని ఆకర్షణీయంగా రూపొందించేందుకు ఆర్థిక సహాయం అందించారు.
పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి  వైభవం https://www.telugumuchatlu.com/sri-jayalakshaswamys-grandeur-on-the-flower-palli/
Tags:Sri Jayalakshaswamy’s grandeur on the flower palli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *