Natyam ad

శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాల‌భైర‌వ హోమం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ కాల‌భైర‌వ‌ హోమం ఘ‌నంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో న‌వంబ‌రు 14 నుండి డిసెంబ‌రు 12వ తేదీ వ‌ర‌కు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్ట‌భైర‌వ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, శ్రీ కాల‌భైర‌వ మూల‌వ‌ర్ల‌కు క‌ల‌శాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, పూజ‌, జ‌పం, హోమం, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

Post Midle

నవంబరు 21న నవగ్రహ హోమం :

హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 21వ తేదీ మంగ‌ళ‌వారం నవగ్రహ హోమం జరుగనుంది.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో   దేవేంద్ర‌బాబు, ఏఈవో  సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్   భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు   ర‌వికుమార్,   బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Sri Kalabhairava Homam at Sri Kapileswara Temple

Post Midle