సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారుడి అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి ముచ్చట్లు:
 
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది
ఆయురారోగ్య‌ప్రాప్తి :
సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పండే పంటలు సూర్యతేజం వల్లనే వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
వాహ‌న సేవ‌లో జెఈవో  వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో  శాంతి, ఏఈవో  గురుమూర్తి, సూపరింటెండెంట్లు  చెంగ‌ల్రాయులు,  రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.
 
Tags: Sri Kalyana Srinivasan in the garb of Govardhana Giridhar on a sunlit vehicle