గజ వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు.ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగా ఏనుగు స్వామికి వాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.
Tags: Sri Kalyana Venkanna on the yard vehicle