Natyam ad

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.  శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వాహనసేవలో టీటీడీ చైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో  వీరబ్రహ్మం దంపతులు, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఈ -2  జగదీష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక అధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్ర‌త్యేక‌ శ్రేణి డెప్యూటీ ఈవో  వరలక్ష్మి, విజివో   బాలి రెడ్డి, ఏఈవో  గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు  మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్  చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు  బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

 

Tags: Sri Kalyana Venkateswara Swami Garudaseva is glorious

Post Midle
Post Midle