Natyam ad

మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో సోమ‌వారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు.ఉద‌యం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.రాత్రి 7 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.వాహ‌న‌సేవ‌లో జేఈవో   వీర‌బ్ర‌హ్మం, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో   వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో   గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు   మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌  వెంక‌ట‌స్వామి, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

 

Tags: Sri Kalyana Venkateswara Swamy in Mohini Alankaram

Post Midle
Post Midle