Sri Kapaleeswararaswamy high school anniversary

ఘ‌నంగా శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల వార్షికోత్స‌వం

Date:19/04/2019

తిరుపతి ముచ్చట్లు:

టిటిడి విద్యాసంస్థ‌ల్లో ఒక‌టైన తిరుప‌తి రూర‌ల్ మండ‌లం వెంక‌ట‌ప‌తిన‌గ‌ర్‌(తాటితోపు)లోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల 11వ వార్షికోత్స‌వం శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పూర్వ ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీ రోశ‌య్య‌, విశిష్ట అతిథిగా ముత్యాల‌రెడ్డిప‌ల్లి స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రీ ఎస్‌.మషురుద్దీన్ విచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు క‌ష్ట‌ప‌డి కాకుండా ఇష్ట‌ప‌డి చ‌దివి ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌న్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండి త‌ల్లిదండ్రుల‌కు, ఉపాధ్యాయుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు శ్రీ టి.చంద్ర‌య్య మాట్లాడుతూ విద్యార్థులు విష‌య‌ప‌రిజ్ఞానం పెంచుకుంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి చెంద‌వ‌చ్చ‌న్నారు. విద్యార్థుల ఎదుగుద‌ల‌కు ఉపాధ్యాయులుగా తీవ్రంగా కృషి చేస్తామ‌న్నారు. అనంత‌రం ఆట‌ల పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

నాణేల త‌ర‌లింపున‌కు టిటిడి చ‌ర్య‌లు

Tags:Sri Kapaleeswararaswamy high school anniversary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *