Natyam ad

కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి  కనువిందు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.   అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ  దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్  భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు రవికుమార్,  బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Sri Kapileswara Swamy Kanuvindu on the Kalpavriksha vehicle

Post Midle