Sri Kapileswaraswamy's salvage on the Hansa vehicle

హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభయం

Date:14/02/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన శుక్ర‌వారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. శ్రీ కామాక్షి అమ్మవారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో   సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌   భూప‌తిరాజు, ఎవిఎస్వో  సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు   రెడ్డిశేఖ‌ర్‌,   శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

శ్రీ క‌పిలేశ్వ‌రస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

Tags: Sri Kapileswaraswamy’s salvage on the Hansa vehicle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *