వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Sri Kodandaramudy Chakrasanam is the exposition

Sri Kodandaramudy Chakrasanam is the exposition

Date:21/04/2019
కడప ముచ్చట్లు:

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో  ఆల‌య ప్రాంగ‌ణంలో నూత‌నంగా నిర్మించిన పుష్క‌రిణిలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

 

 

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

 

 

 

 

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

 

 

 

 

 

కాగా రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  న‌టేష్ బాబు, ఏఈవో  రామరాజు, ఇతర అధికారులు, విశేష‌ భక్తులు పాల్గొన్నారు.

పుష్పయాగం 

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.

కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

Tags:Sri Kodandaramudy Chakrasanam is the exposition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *