బద్వేలులో వైభవంగా శ్రీకృష్ణ జయంతి వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన ఆడ చైర్మన్ సింగసాని గురు మోహన్
బద్వేలు ముచ్చట్లు:
బద్వేల్ లో శుక్రవారం శ్రీకృష్ణ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి స్థానిక నెల్లూరు రోడ్డు లోని శ్రీకృష్ణ ఆలయంలో యాదవ సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు వేడుకల్లో వందలాది మంది భక్తులు కుటుంబాలు హాజరయ్యారు ఉదయం నుంచే స్వామివారి వేడుకలు ప్రారంభమయ్యాయి స్వామి వారిని విశేషంగా అలంకరించారు స్వామివారి విగ్రహానికి రకరకాల పూలమాలతో అలంకరించారు ఆలయానికి వచ్చిన భక్తులు విశిష్ట పూజలు చేశారు ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది కొంతమంది భక్తులు తమ చిన్నారులను శ్రీకృష్ణుని అలంకారం తో అలంకరించారు చాలా మంది చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణతో రావడం జరిగింది వారిని చూసిన పలువురు భక్తులు పరవశించి పోయారు ఆలయ ప్రాంగణంలో ఉట్టి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవంలో పలువురు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఆడా చైర్మన్ సింగ సాని గురు మోహన్ ప్రారంభించారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి యాదవ్ యాదవ సంఘం నాయకులు బుర్రి రాజా యాదవ్ తదితరులు పాల్గొని ఉత్సవానికి ప్రత్యేక శోభ తీసుకువచ్చారు శ్రీకృష్ణ జయంతి వేడుకలు గతంలో ఎప్పుడు జరగని రీతిలో జరిపించారు ఇదే సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదం చేశారు.

Tags: Sri Krishna Jayanti celebrations in Badwelu
