11న శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Date:09/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

Sri Krishnashtami celebrations on the 11th

పట్టణ సమీపంలోని కృష్ణమరెడ్డిపల్లె రోడ్డు సమీపంలో గల శ్రీకృష్ణ ఆలయంలో ఈనెల 11న గోకులాష్టమి పండుగను నిర్వహిస్తున్నట్లు యాదవసంఘ కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆలయ సమీపంలో యాదవ సంఘ సీనియర్‌ నాయకుడు వెంకటరెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో యాదవులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ పండుగను పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పూజలకు హాజరైయ్యే భక్తులు తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ, మాస్క్లు ధరించి రావాలని కోరారు.

అక్రమ మద్యం రవాణాలపై విస్తృతంగా పోలీసు బృందాల దాడులు

Tags: Sri Krishnashtami celebrations on the 11th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *