తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం

Date:23/02/2021

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగ‌ళ‌‌వారం సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్స‌వ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.కాగా బుధ‌వారం నుండి శుక్ర‌వారం వరకు శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఏఈవో   ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు   వెంక‌టాద్రి, ‌‌  రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు   కామ‌రాజు,   మునీంద్ర‌బాబు ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags;Sri Krishnaswamy’s excursion with Andal on a raft

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *