శ్రీలంక నరమేధం – ఈఫిల్ టవర్ నివాళులు

Sri Lankan massacre - Eiffel Tower Responsibilities
Date:22/04/2019
పారిస్ ముచ్చట్లు:
శ్రీలంక నరమేధంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పిస్తూ పారీస్‌లోని ఈఫిల్ టవర్‌‌పై విద్యుత్ దీపాలను ఆర్పేశారు. శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 290కు చేరింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం 500 మంది తీవ్రంగా గాయపడినట్టు పోలీస్ అధికార ప్రతినిధి సోమవారం ఉదయం తెలిపారు. ఈ నరమేధంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పిస్తూ పారీస్‌లోని ఈఫిల్ టవర్‌‌పై విద్యుత్ దీపాలను ఆర్పేశారు. గతంలో కూడా పలు ఉగ్రదాడుల్లో చనిపోయినవారికి నివాళులు అర్పిస్తూ ఈఫిల్ టవర్‌ను చీకటిమయం చేశారు. 2017, మేలో మంచేస్టర్‌లోని ఎరియాన గ్రాండే కన్సర్ట్‌పై ఉగ్రదాడి, 2015 నవంబరులో పారీస్‌లోని ఆరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడులకు నిరసనగా ఈఫిల్ టవర్‌పై విద్యుత్తు దీపాలను ఆపేసి సంతాపం ప్రకటించారు. ఆదివారం ఈస్టర్ సండేను పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు, విదేశీ పర్యటకులు తాకిడి ఎక్కువగా ఉండే హోటల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఆరు చోట్ల బాంబులు పేల్చారు. కొలంబో పేలుళ్లలో 40 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఈ దాడుల వెనుక ఐసీస్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాల్దీవుల నుంచి బంగ్లాదేశ్ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన ఉగ్రదాడులతో సంబంధాలు కలిగిన ఐసీస్ శ్రీలంకలోనూ విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. తమిళనాడులో ఉనికి చూపుతున్న తౌహీద్ జమాత్ పాత్ర కూడా ఈ దాడుల వెనుక ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:Sri Lankan massacre – Eiffel Tower Responsibilities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *