Sri Malayappa in the pearl shield

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Date:05/06/2020

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శుక్ర‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు.ఉదయం 7.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకం చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ   అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో   ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో   హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిండిలేక సచ్చిపోదాం… మనుషులను మాత్రం నమ్మకు

Tags: Sri Malayappa in the pearl shield

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *