Sri Narasimha Jayanti at Srivari Temple

శ్రీవారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి

Date:07/05/2020

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌‌వారం సాయంత్రం నృసింహ జయంతి జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.  శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో   అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో   ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

Tags: Sri Narasimha Jayanti at Srivari Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *