చెన్నైలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

Sri Padmavathi Amman's Brahmots in Chennai

Sri Padmavathi Amman's Brahmots in Chennai

Date:14/11/2019

తిరుప‌తి ముచ్చట్లు:

న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు చెన్నైలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు. చెన్నై న‌గ‌రంలోని టిటిడి స‌మాచార కేంద్రంలో గ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల త‌ర‌హాలో ఇక్క‌డ ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం విశేషం. తొమ్మిది రోజుల పాటు సాయంత్రం 6.30 గంట‌ల‌కు వాహ‌న‌సేవ జ‌రుగుతుంది. ఆయా వాహ‌నాల్లో అమ్మ‌వారిని కొలువుదీర్చి స్వామివారి ఎదుట వేంచేపు చేసి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. గ‌జ‌వాహ‌నం రోజున మాత్రం అమ్మ‌వారిని ఆల‌యం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హిస్తారు. టిటిడి ఏఈవో శ్రీ టి.ముర‌ళీధ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలిలా ఉన్నాయి.

న‌వంబ‌రు 23న – చిన్న‌శేష వాహ‌నం
న‌వంబ‌రు 24న – హంస వాహ‌నం
న‌వంబ‌రు 25న – సింహ వాహ‌నం
న‌వంబ‌రు 26న – క‌ల్ప‌వృక్ష వాహ‌నం
న‌వంబ‌రు 27న – గ‌జ వాహ‌నం
న‌వంబ‌రు 28న – గ‌రుడ వాహ‌నం
న‌వంబ‌రు 29న – చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నం
న‌వంబ‌రు 30న – అశ్వ‌ వాహ‌నం
డిసెంబ‌రు 1న – పంచ‌మి తీర్థం
డిసెంబ‌రు 2న – పుష్ప‌యాగం

 

వైకుంఠ ఏకాదశి, ద్వాద‌శి ఏర్పాట్లపై అద‌న‌పు ఈవో సమీక్ష

 

Tags:Sri Padmavathi Amman’s Brahmots in Chennai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *