Sri Padmavathi Ammavar's Spring Celebrations at Thiruchanur

తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Date:08/05/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.వసంతోత్సవాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని ఆశీర్వ‌చ‌న మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు పనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ   ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు   శ్రీనివాసాచార్యులు, ఏఈఓ   సుబ్రమణ్యం, కంకణభట్టార్   మణికంఠస్వామి, సూప‌రింటెండెంట్   గోపాల‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుంది

Tags: Sri Padmavathi Ammavar’s Spring Celebrations at Thiruchanur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *