Sri Padmavathi anointed as sirulalathalli in Tiruchanoor

తిరుచానూరులో సిరుల‌త‌ల్లి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

Date:04/06/2020

తిరుపతి ముచ్చట్లు:

సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా 4వ‌ రోజైన గురువారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో  ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవర్ల‌కు అభిషేకం చేశారు. కాగా జూన్ 5వ తేదీ శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకంతో తెప్పోత్స‌వాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో  సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

సినిమా థియేటర్లపై కేంద్రం కీలక నిర్ణయం

Tags: Sri Padmavathi anointed as sirulalathalli in Tiruchanoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *