Sri Padmavati anointed for the sale in Tiruchanoor

తిరుచానూరులో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

Date:03/06/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా మూడ‌వ రోజైన బుధ‌‌వారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో  ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవర్ల‌కు అభిషేకం చేశారు. కాగా జూన్ 4,5వ తేదీల‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో  ఝాన్సీరాణి, ఏఈవో   సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

పుంగనూరులో కల్తీపాలు – హాడలిపోతున్న జనం

Tags: Sri Padmavati anointed for the sale in Tiruchanoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *