వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

తిరుపతి ముచ్చట్లు:

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం 9.15 నుండి 10.45 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.ఈ కార్యక్రమంలో ఏఈవో రమేష్, సూపరింటెండెంట్‌  శ్రీవాణి, కంకణ బట్టర్  సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్ పాల్గొన్నారు.

 

Tags:Sri Prasanna Venkateswara Swamy Chakrasnanam in glory

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *