ప‌ల్ల‌కీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి ముచ్చట్లు:

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు.మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.రాత్రి 7.30 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈవో  గోవింద రాజన్, ఏఈవో రమేష్, కంకణ భట్టర్  సూర్యకుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్  శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  శివకుమార్ పాల్గొన్నారు.

Tags:Sri Prasanna Venkateswara Swamy in Mohini Alankaram on palanquin

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *