సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

తిరుపతి ముచ్చట్లు:

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం ఉద‌యం స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో చిన్నశేష వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించారు.సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు చెబుతున్నారు.కాగా సోమ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు దర్శనమివ్వనున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సూప‌రింటెండెంట్  గోపాల కృష్ణారెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు  కంక‌ణ‌బ‌ట్టార్  సూర్య‌కుమార్ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Sri Prasanna Venkateswaraswamy in the decoration of Yoga Narasimha on a lion vehicle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *