Sri Ramachandra Murthy's rescue on raft

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి అభయం

 Date:18/04/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా  స్వామివారు ఏడుచుట్లు తిరిగి భక్తులకు అభయమివ్వనున్నారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు ఉత్సవర్లకు సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 6.00 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో   శ్రీ‌ధ‌ర్ , ఏఈవో   తిరుమ‌ల‌య్య‌, సూపరింటెండెంట్‌  ర‌మేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

 

Tags:Sri Ramachandra Murthy’s rescue on raft

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *