Natyam ad

అక్టోబ‌రు 23న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామకోటి విజయోత్సవం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 23న సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీరామకోటి విజయోత్సవం జ‌రుగ‌నుంది. భ‌క్తులు ఇక్క‌డి ఆలయంలోగానీ, ఇళ్ల వ‌ద్ద‌గానీ సంవత్సర కాలంలో రాసిన శ్రీరామకోటి పుస్తకాలను శ్రీరామకోటి స్థూపంలో నిక్షిప్తం చేయడాన్ని ”శ్రీరామకోటి విజయోత్సవం”గా ప్రతి సంవత్సరం విజయదశమినాడు నిర్వహించడం సంప్రదాయం.ఈ సందర్భంగా శ్రీరామనామ కోటి పుస్తకాలను శ్రీకోదండరామస్వామివారి ఆలయం నుండి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి దొడ్డాపురంవీధి, గాంధీరోడ్డు, ప్రకాశంరోడ్డు, మహతి కళాక్షేత్రం మీదుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకుంటారు. అక్కడున్న‌ శ్రీ రామకోటి స్థూపంలో శ్రీరామనామ కోటి పుస్తకాలను నిక్షిప్తం చేస్తారు.

 

Post Midle

Tags: Sri Ramakoti Victory Festival at Sri Kodandaramaswamy temple on 23rd October

Post Midle