Natyam ad

పుంగనూరులో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు

పుంగనూరు ముచ్చట్లు:

శ్రీరామనవమి పండుగ సందర్భంగా వివిధ రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం పట్టణంలోని హనుమంతురాయునిదిన్నెలో గల శ్రీఆంజనేయస్వామి, సుబ్బమ్మ చెరువు వద్ద గల శ్రీఆంజనేయస్వామికి, కట్టక్రిందపాళ్యెంలో గల శ్రీకోదండరామస్వామికి , మార్లపల్లెలో గల శ్రీఅభయాంజనేయస్వామికి, అరవపల్లె వద్ద గల శ్రీవీరాంజనేయస్వామికి, హైస్కూల్‌వీధిలో గల కోదండరామస్వామి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి, స్వామివార్లకు వేకువజాము నుంచి అభిషేకాలు, హ్గమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలలో భక్తులు రామనామస్మరణ చేశారు. పలు ఆలయాలలో రామకీర్తన ఆలాపించారు. రాత్రి పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా పానకము, మినపపప్పు , మజ్జిగతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

 

Post Midle

Tags; Sri Ramanavami celebrations in Punganur

 

Post Midle