Natyam ad

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు.  రాత్రి 7 గంటల నుండి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 గంటలకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో  ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, అదనపు ఎఫ్ ఏ అండ్ సిఏఓ  రవి ప్రసాదు, ఏఈవో  పార్థ‌సార‌థి, సూపరింటెండెంట్‌  సోమ‌శేఖ‌ర్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Tags:Sri Ramapattabhishekam in splendor at Sri Kodandaramaswamy temple

Post Midle
Post Midle