శ్రీ రెడ్డి…అమాయక పిల్ల.. అపూర్వ

Date:27/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
‘శ్రీరెడ్డి అమాయకపు ఆడపిల్ల. టీవీ చానెళ్లు, తమ వ్యూస్ కోసం ఆమెను బలి పశువు చేశారు’’ అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో ఆమె కష్టాలు ఎదుర్కొన్న మాట వాస్తవమే. అయితే, వాటిని తగిన విధంగా చెప్పి ఉండాలని ఆమె అన్నారు. నిజంగా తెలివైనదైతే అలా చేయదు. తెలివి లేదు కాబట్టే ఆమె అలా చేసిందని అపూర్వ వెల్లడించారు. ‘అల్లరి’ సినిమాలో నరేష్‌కు తల్లిగా నటించిన అపూర్వ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో వ్యాప్ పాత్రల్లో నటించారు. కామెడీ సినిమాల్లో కూడా మెప్పించారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘శ్రీరెడ్డికి ఈ విధంగా ఇండస్ట్రీని రోడ్డు మీదకు లాగకుండా ఉండాల్సింది. ఆమె సమస్యను తీర్చే పెద్దలు ఇండస్ట్రీలో ఉన్నారు. శివాజీ రాజా, హేమా, భరద్వాజ, అలీ.. వీరిలో ఎవరి వద్దకైనా వెళ్లి తన సమస్య చెప్పి ఉండాల్సింది. శ్రీరెడ్డి నీకు మేము ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీ అండగా ఉంది’’ అని అన్నారు.  మేమేమీ ఇండస్ట్రీలో పొడిచేసి ఈ స్థాయికి రాలేదని అపూర్వ అన్నారు. ‘‘మొదట్లో మేం కూడా సమస్యలు ఎదుర్కొన్నాం. నువ్వు బయటకు వచ్చి మంచి పనే చేశావు. ఏం చెప్పాలనుకున్నావో చెప్పేసేయ్. లేదా వదిలేయ్. కానీ, ఈ వివాదాన్ని మరీ డ్రాగ్ చేయకు. నిన్ను నవ్వు గందరగోళంలోకి నెట్టుకోకు. ఇండస్ట్రీలో మంచివాళ్లు ఉన్నారు. నువ్వు రా, నీ కష్టం చెప్పుకో. ‘‘కేవలం శ్రీరెడ్డే కాదు. మరెవ్వరూ తల్లిదండ్రులను వదిలేసి రోడ్డు మీదకు రాకూడదు. అలా వచ్చిన వాళ్లను రోడ్డు మీద ఉన్నవారు అవకాశంగా మలుచుకుంటారు. అలాంటి సమస్యలను ఇండస్ట్రీ పెద్దలకు చెప్పుకుంటే పరిష్కరిస్తారు. నిర్మాతలు కూడా తెలుగువారికి సినిమాల్లో అవకాశాల ఇవ్వండి. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి’’ అని అపూర్వ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు
Tags:Sri Reddy … innocent baby .. extraordinary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *