శ్రీ రెడ్డి మరో అశోకుడు… ఆర్జీవీ 

Sri Reddy is another Ashok ... RJV

Sri Reddy is another Ashok ... RJV

Date:16/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి ప్రకంపనలు సృష్టిస్తోన్న నటి శ్రీరెడ్డిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీరెడ్డి నిజాయితీని ఎదుర్కోవడానికి మగాళ్లంతా భయంతో వణికిపోతున్నారని, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆడాళ్లంతా కుళ్లుకుంటున్నారని వర్మ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిజంగా నిజాయితీ కలిగిన మహిళలు శ్రీ స్త్రీ శక్తిని (తాజాగా శ్రీరెడ్డి తన పేరును శ్రీ శక్తిగా మార్చుకున్నారు) అనుసరిస్తారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.‘అశోకుడు చాలా మంది ప్రజలను చంపేశాడు. ఆ తరవాత ఆయన మనసు మారింది. కొన్ని లక్షల మందికి ఆపద్భాందవుడిగా మారాడు. అందుకే ఇప్పుడు శ్రీరెడ్డి కూడా అశోకుడు అంతటి గొప్ప వ్యక్తని నేను అనుకుంటున్నాను’ అని వర్మ ఆఖరి ట్వీట్‌లో పేర్కొన్నారు. వివాదాస్పద అంశాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండే వర్మ.. చాలా రోజులుగా శ్రీరెడ్డి వివాదంపై స్పందిస్తూ వస్తున్నారు. తన మద్దతు శ్రీరెడ్డికి ఉంటుందని ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి మాత్రం ఆయన దీనిపై మాట్లాడలేదుగతంలో శ్రీరెడ్డి చేసిన పనులు, ఆమె వాడిన భాషను గుర్తుచేస్తూ.. తన స్వార్థం కోసం పోరాటం చేసే శ్రీరెడ్డి సామాజిక కార్యకర్త ఎలా అవుతుందని ఇప్పుడు చాలా మంది వాదిస్తున్నారు. వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు. అశోకుడు అంతటి గొప్ప రాజే తన మనసును మార్చుకున్నాడు’ అని మరో ట్వీట్‌లో వర్మ వెల్లడించారు.
Tags:Sri Reddy is another Ashok … RJV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *