శ్రీ రెడ్డీ లీక్స్ కంటిన్యూ…

Sri Reddy Leaks Continu ...

Sri Reddy Leaks Continu ...

Date:14/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఇప్పటివరకు తెలుగు చలన చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పలువురిని లక్ష్యంగా చేసుకున్న నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు తమిళ ఇండస్ర్టీని టార్గెట్ చేసుకుంది. తమిళ్ లీక్స్ పేరుతో ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్‌‌పై తొలి అస్త్రాన్ని సంధించింది. లారెన్స్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని, ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడంటూ ఆమె బాంబు పేల్చింది.కొంతమంది స్నేహితుల ద్వారా నాకు లారెన్స్ మాస్టర్ గురించి తెలిసింది. ఆ రోజు మేము మసాబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్ లాబీలో కలిశాం. ఆ తర్వాత లారెన్స్ నన్ను తన రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆయన గదిలోకి వెళ్లగానే రాఘవేంద్ర స్వామి ఫొటో, కొన్ని రుద్రాక్షలు చూసి వావ్ అనుకున్నా. ఆ తర్వాత లారెన్స్ తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. తాను చాలా పేద కుటుంబ నుంచి వచ్చానని, ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారికి సాయం చేయడానికి తాను ఇష్టపడతానని తెలిపాడు. తాను పేద పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నానని చెప్పాడు. అది విని నేను ఇంప్రెస్ అయ్యాను. కానీ, నెమ్మది.. నెమ్మదిగా తన అసలు రంగు చూపించాడు. నా నడుము చూపించమని అడిగాడు. అది చూపించు, ఇది చూపించు అన్నాడు. ఆ తర్వాత అద్దంలో చూసుకుంటూ నిన్ను నువ్వు టెమ్ట్ చేసుకో అన్నాడు. కొన్ని రొమాంటిక్ మూవ్స్ చేయ్యి, అద్దంతో రొమాన్స్ చెయ్యి అన్నాడు. ఆ తర్వాత అతను ‘రైడ్’ చేశాడు. ఆ పని పూర్తికాగానే నీకు ఆఫర్ కన్ఫార్మ్ అన్నాడు. అతనితో కొన్నాళ్లు కొనసాగించిన స్నేహానికి.. బెల్లకొండ విలన్ అయ్యాడు. ’’ అని తన ఫేస్‌బుక్ అకౌంట్లో పేర్కొంది. అయితే, లారెన్స్‌ చేసే మంచి పనులు గురించి తెలిసిన వ్యక్తులు.. ఆమె ఆరోపణలను ఖండిస్తున్నారు. నువ్వే అవకాశాల కోసం వారి దగ్గరకు వెళ్లి ఆఫర్ చేసి ఉంటావని కొందరు, ఎవరో ఒకరిని లక్ష్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ఫేక్ పోస్టులు పెట్టకని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి.. ఇప్పటికే పలువురు హీరోలను, నటులను లక్ష్యంగా చేసుకుని వివిధ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వారితో మాట్లాడిన వాట్సాప్ సందేశాలను కూడా శ్రీరెడ్డి లీక్స్‌తో బయటపెట్టింది. ఫిల్మ్ చాంబర్ ముందు అర్థనగ్నం నిరసనతో జాతీయ మీడియానూ ఆకట్టుకుంది. తమిళ పరిశ్రమలో దర్శకుడు మురుగదాస్, హీరో శ్రీకాంత్‌లు కూడా అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపణలు చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్‌కే పరిమితమైన ఈ వివాదం.. తమిళ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.
శ్రీ రెడ్డీ లీక్స్ కంటిన్యూ…https://www.telugumuchatlu.com/sri-reddy-leaks-continu/
Tags: Sri Reddy Leaks Continu …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *