తెలుగులో శ్రీరెడ్డికి మూవీ

Sri Reddy movie in Telugu

Sri Reddy movie in Telugu

Date:06/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరు చెబితే టాలీవుడ్‌లో చిరాకుపడే వాళ్లే ఎక్కువమంది ఉంటారు. ఎందుకంటే ఆమె చేసిన రచ్చ అలాంటిది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరకాలంటే కొందరి కోరికలు తీర్చక తప్పదంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలే చేసింది ఈ నటి. అప్పటికే ఎంతో మంది కోర్కెలు తీర్చనంటూ ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన కూడా చేసింది. ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద వాళ్లను ఇన్వాల్వ్ చేయడమే కాకుండా వారిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. దీంతో మొదటికే మోసం వచ్చింది. ఆమెకు అవకాశం ఇచ్చే నాథుడే లేకుండాపోయాడు.ఇక టాలీవుడ్‌లో అవకాశాలు రావని అర్థంచేసుకున్న శ్రీరెడ్డి మకాంను చెన్నైకి మార్చింది. అక్కడ కూడా పాపులారిటీ కోసం కొంత మంది స్టార్లపై బురదజల్లే ప్రయత్నం చేసింది. దీంతో ఈమెను అక్కడ కూడా ఛీకొట్టారు. ఇక చేసేదేమీ లేక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, కామెంట్లు పెడుతూ కాలం వెళ్లదీస్తోంది. అప్పుడప్పుడు అందాలు ఆరబోసే ఫ్యాషన్ షోలు కూడా చేస్తోంది. అయితే, తాజాగా శ్రీరెడ్డికి టాలీవుడ్‌ నుంచి కాల్ వచ్చింది. ఒక సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘డ్రీమ్’ సినిమా దర్శకుడు భవాని శంకర్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తు్న్నారు. ‘క్లైమాక్స్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో శ్రీరెడ్డికి ఒక కీలక పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, కమెడియన్ పృథ్వితో కలిసి శ్రీరెడ్డి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వివాదాస్పద నటి పాత్రలో శ్రీరెడ్డి నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతోనైనా శ్రీరెడ్డికి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి!

 

అల్టిమేటం జారీ చేసినా కార్మికులు ఉద్యోగంలో చేరలేదు

 

Tags:Sri Reddy movie in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *