ఉత్తరద్వారం లో కొలువైన శ్రీ సింహాద్రి అప్పన్న

-ప్రత్యేక పూజలు నిర్వహించిన సింహాచలం  దేవస్థానం
-ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల
సింహాచలం  ముచ్చట్లు:
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గురువారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు కు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. తొలుత సర్వాభరనాలతోస్వామిని  చూడముచ్చటగా వైకుంఠనాథుడు అలంకరణగా గావించి తదుపరి  స్వామిని ఉత్తర ద్వారంలో ఆశీనులను చేశారు.. వేదమంత్రోచ్ఛారణల మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ కొలువై ఉన్న స్వామిని పలువురు భక్తులు  దర్శించుకున్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు. జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొని స్వామిని పూజించి సేవించారు..
కొండ దిగువన శ్రీ  వెంకటేశ్వర ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం  నిర్వహించారు.. అక్కడ కూడా శ్రీను బాబు దంపతులు స్వామిని  సేవించారు.. ఈ సందర్భంగా భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sri Simhadri Appanna, who was found in the north gate

Natyam ad