Natyam ad

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి ముచ్చట్లు:

 

చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.ఇందులోభాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం చేశారు. ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.అనంత‌రం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో  దేవేంద్ర బాబు, విజీవో  బాలి రెడ్డి,సూప‌రింటెండెంట్‌  శ్రీ‌నివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  హరిబాబు,
ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Sri Sitaram’s Kalyanam is glorious in Sri Kodandaramalayam

Post Midle