నేటి నుండి శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ 25వ వార్షిక ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

 

కొత్తగూడెం పట్టణం బూడిద గడ్డ బస్తీలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో నేటి నుండి ఈనెల 24వ తేదీ వరకు అమ్మవారి దేవాలయ 25వ వార్షిక ఆషాడ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మహంకాళి ఉపాసకులు నరేంద్ర భవాని స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల పాలిట కల్పతరువుగా  వెలుగొందుతూ, కొత్తగూడెం పట్టణ ప్రజల కొంగుబంగారమై1963వ సంవత్సరంలో పాసి కులస్తులచే ప్రతిష్టించబడిన మహంకాళి అమ్మవారు 1995 వ సంవత్సరం నుండి మహంకాళి ఉపాసకులు  నరేంద్ర భవాని స్వామి ఉపాసన, అమ్మవారి అనుగ్రహంతో దినదిన ప్రవర్తమానంగా ప్రవర్ధిల్లుతూ నూతన ఆలయ నిర్మాణములు పూర్తి చేసుకొని 2004లో అమ్మవారి దివ్య ప్రతిష్ట కార్యక్రమములు నిర్వహించ కొనబడి, ప్రతి సంవత్సరము వార్షిక ఆషాడ మాస బోనాల జాతర కార్యక్రమంలో భక్తుల పాలిట కల్పవల్లిగా వెలుగొందుతున్న శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారికి 25వవార్షిక ఆషాడ మాస బోనాల జాతర జరిపించుటకు అమ్మవారి ఆజ్ఞగా నిశ్చయించడమైనట్లు మహంకాళి ఉపాసకులు నరేంద్ర భవాని స్వామి, స్థల దాతలు ఈడుపుగంటి  శ్రీనివాసరావు,  రవీందర్ లు, పాసి కులస్తులు సత్యనారాయణ పాసి, హీరాలాల్ పాసి, బాల పాసి, బాబాదిన్ పాసి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా భక్త మహాశయులందరూ ప్రతిరోజూ అమ్మవారిని దర్శించి, తీర్థప్రసాదములు స్వీకరించి, తమ తమ శక్తి కొలది ధన ,ద్రవ్య, వస్తు ,శక్తి రూపేణా సంపూర్ణసహకారము నందించి అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులై తరించగలరని కోరారు.

 

Tags; Sri Sri Mahankali Ammavari Temple 25th Annual Ashada Masa Bonala Jatara Mahotsavas from today

Leave A Reply

Your email address will not be published.