Natyam ad

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

తిరుమల ముచ్చట్లు:

విశాఖలోని శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో   ఏవి.ధర్మారెడ్డి, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయవల్ల కురుక్షేత్రలో లక్ష చండీయాగం చక్కగా నిర్వహించామని తెలియజేశారు. ఇందుకోసం శ్రీవారిని కృతజ్ఞతాపూర్వకంగా దర్శనం చేసుకున్నామని, టిటిడి అధికారులు చక్కటి దర్శన ఏర్పాట్లు చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, విజివో బాలిరెడ్డి, పేష్కార్  శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Sri Sri Sri Swarupanandendra Saraswati Swami, Visakha Sharada head who visited Tirumala Sri

Post Midle