శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం బ్రహ్మ రాత్రి ఆరవ తిరునాళ్లు
శ్రీకాళహస్తీ ముచ్చట్లు :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరవ తిరునాళ్లు బ్రహ్మ రాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామిశ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మ వారు రథంపై అధిరోహించి కర్పూర హారతులు సమర్పించారు.అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశ్శివాయ నామస్మరణ ల మధ్య
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి
,chief festival officer, రామచంద్ర మోహన్ పాలకమండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు,* శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వాహక అధికారి కె.వి.సాగర్ బాబుమరియు పాలకమండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Tags: Sri Swami Ammavarla Rathotsavam is the sixth Tirunala of Brahma night
