భక్తులకు అందుబాటులో శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం

Date:17/03/2019

తిరుమల ముచ్చట్లు:

శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగాన్ని తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంచారు. ఈ పంచాంగం ధరను రూ. 55 గా టీటీడీ దేవస్థానం నిర్ణయించింది. టీటీడీ ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పంచాంగాన్ని టీటీడీ ఆస్థాన సిద్ధాంతి  శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి రచించగా,  వైఖానసాగమ పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు పరిష్కరించారు. మొత్తం 60 వేల ప్రతులను టిటిడి ముద్రించింది. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో ఈ పంచాంగాన్ని అందుబాటులో ఉంచుతారు.

ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డిని కలిసిన ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప

Tags:Sri Vikari Nama Annual Calendar available for devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *