సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న శ్రీదేవి

Sridevi is the director of the suspense thriller movie

Sridevi is the director of the suspense thriller movie

Date:27/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
శ్రీదేవి మరణం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఆమె మృతికి కారణాలపై ఎన్నో ఊహాగానాలు… మరెన్నో అనుమానాలు. ముందు గుండెపోటు… తర్వాత సర్జరీల ఎఫెక్ట్‌తో చనిపోయింందని… తర్వాత ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయిందని. ఇలా పూటకో మాట వినిపించింది. ఇప్పుడు కేసు మరికొన్ని మలుపులు తిరిగింది. అయితే ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెరపైకి తెస్తోందట. అసలు హోటల్ గదిలో ఆమెతో పాటూ ఎవరెవరు ఉన్నారు? ఒకవేళ బాత్ టబ్‌లో పడి ఉంటే బయటకు ఎందుకు రాలేకపోయారు? టబ్‌లో కేవలం అరగుడు లోతు నీళ్లు ఉంటాయి. కాబట్టి ఆమె చనిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు. ఈ మర్డర్ మిస్టరీ వీడాలంటే లోతైన విచారణ జరగాలని పోలీసులు, ప్రాసిక్యూషన్ భావిస్తోందట.భౌతికకాయం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పోలీసులకు అనుమానాలు రావడంతో కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతుల్లోకి వెళ్లింది. అటు బోనీ కపూర్‌తో పాటూ హోటల్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. అయితే వారు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేదు. అలాగే బోనీ కపూర్, శ్రీదేవి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బోనీ కపూర్ పాస్‌పోర్ట్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్ విడిచి వెళ్లకూడదని చెప్పారట. హోటల్‌ రూమ్‌లో సీన్ రీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మిస్టరీ వీడిన తర్వాతే భౌతికకాయాన్ని అప్పగిస్తారట. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మరోసారి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని కోరారట.శ్రీదేవి మెడికల్ రికార్డుల్ని పోలీసులు తెప్పించుకుంటున్నారట. గతంలో జరిగిన సర్జరీలతో పాటూ ఆమె వాడిన మెడిసిన్స్‌పై ఆరా తీసే పనిలో ఉన్నారు. మరోవైపు ముంబైలోని కపూర్ ఆఫీస్‌ సిబ్బంది మాత్రం ఇవాళ భౌతికకాయం ఇండియాకు తరలిస్తారని చెబుతున్నారు
బోనీని ప్రశ్నించలేదు.శ్రీదేవి మృతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి గంటకో పుకారు బయటకి వస్తోంది. ఈ సందర్భంలో బోనీ కపూర్‌ను దుబాయ్ పోలీసులు ప్రశ్నించారని, లేదని రకరకాల వార్తలు వచ్చాయి.. ఆయన్ను మూడు గంటల పాటూ ప్రశ్నించినట్లు వార్తలొచ్చాయి. కాని దీన్ని దుబాయ్ పోలీసులు కొట్టి పారేశారట. అసలు బోనీని ప్రశ్నించలేదని చెప్పారు. శ్రీదేవి ఎలా చనిపోయారన్న విషయంపై మాత్రమే వాంగ్మూలం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ఆదివారం ఉదయం తీసుకున్నామని… తర్వాత ఆయన్ను విచారించలేదని… దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారట.అలాగే శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురావడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్ అధికారులు శ్రీదేవి మృతిపై విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాసిక్యూషన్‌ నివేదిక అందిన తర్వాతే ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. భౌతికకాయం ముంబయి రావడానికి మరింత సమయం పట్టే అవకాశమునట్లు తెలుస్తోంది. ఈ లోగా అనిల్ కపూర్ ఇంటి వద్ద ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు పడిగాపులు పడుతున్నారు.
Tags: Sridevi is the director of the suspense thriller movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *