సీనినటి శ్రీదేవి భౌతికకాయం రాత్రికి ముంబైకి తరలింపు

Sridevi's body move to Mumbai at night
Date:25/02/2018
ముంబై ముచ్చట్లు:
గుండెపోటుతో దుబాయ్ ఆసుపత్రిలో మృతి చెందిన సీని నటి శ్రీదేవి భౌతికకాయాన్ని రాత్రి 8 గంటలకు ముంబైకి ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. దుబాయ్ దేశంలోని నిబంధనల మేరకు శ్రీదేవి మృతదేహానికి శవపంచనామ నిర్వహించి, శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. కాగా శ్రీదేవి ఇంటి వద్ద అభిమానులు విషాదంతో శ్రీదేవి భౌతికకాయం కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం పూర్తి అధికారిక లాంచనాలతో దహనక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు, అంత్యక్రియలకు సీని ప్రముఖులు, రాజకీయ ప్రతినిధులు హాజరుకానుండటంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
Tags: Sridevi’s body move to Mumbai at night