శ్రీదేవిది హత్యే… సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణ!

Sridevi's murder ... Subramanian Swamy's sensational accusation!

Sridevi's murder ... Subramanian Swamy's sensational accusation!

– ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు
– పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక వచ్చాకే మాట్లాడతా
Date:27/02/2018
న్యూడిల్లీ  ముచ్చట్లు:
నటి శ్రీదేవి మరణంపై బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఆమెది హత్యే అని ఆయన ఆరోపిస్తున్నారు. శ్రీదేవి తన ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించేవారని ఆయన అన్నారు. ఎవరో ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, స్నానాల తొట్టెలోకి తోసి చంపి ఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే శ్రీదేవి మరణానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక బయటకు వచ్చిన తర్వాతే దీనిపై మరింత స్పందించగలనని ఆయన చెబుతున్నారు.మరోవైపు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను నిన్న మూడు గంటల పాటు విచారించిన దుబాయ్ పోలీసులు ఈ రోజు కూడా విచారించినట్లు తెలిసింది. అలాగే ఆమె మొబైల్ ఫోన్ సంభాషణల రికార్డులను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ లో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతుండటంతో ఆమె భౌతికకాయం ముంబైకి ఎప్పుడు చేరుకుంటుంది? అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి? అనే దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయి: ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో శ్రీదేవి మృతి పట్ల టీడీపీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం అరుదైన అంశమని కొనియాడారు.
Tags;Sridevi’s murder … Subramanian Swamy’s sensational accusation!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *