Natyam ad

శ్రీధర్ వర్మ బావ వాసు దేవ వర్మ వై ఎస్ ఆర్ సి పి లో చేరిక

-కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

తెలుగుదేశం పార్టీ రాయలసీమ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ బావ 14వ వార్డు లోని భైరాగిపట్టేడ నివాసి వాసు దేవ వర్మ బుధవారం సాయంత్రం తిరుపతి పద్మావతి పురంలోని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నివాసంలో టీడీపీ వీడి వై ఎస్ ఆర్ సీ పి లో వై ఎస్ ఆర్ టి యూ సీ జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో చేరారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల అక్కర్శితులై టీడీపీ నుండి వై సీ పి లో వాసుదేవ వర్మ మరియు వారి మిత్రులు చేరడం సంతోసించదగ్గ విషయమన్నారు.

 

వాసు దేవ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్సించి, తిరుపతిలో శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న టీడీపీ ని వీడి వైఎస్ ఆర్ సీ పి లో చేరుతున్నట్లు తెలిపారు. 14వ వార్డులో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.
వై ఎస్ ఆర్ టీ యు సీ జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ వాసుదేవ వర్మ టీడీపీ నుండి వై ఎస్ ఆర్ సీ పి లోనికి చేరడం వలన పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందాని అశభవం వ్యక్తం చేసారు.
టీడీపీ నుండి వై ఎస్ ఆర్ సీ పి లో చేరిన వారిలో ఎన్. గురునాదం, టీ. బాబు, ఏ. భార్గవ్, ఎం. నిఖిల్, పి. చందు, డి. సాయి తేజ, రంగనాయికి, జయంతి లు ఉన్నారు.

ఈ కార్యక్రమం లో వై ఎస్ ఆర్ సీ పి 14 వ డివిజన్ అధ్యక్షులు అనీల్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు తిరుమల రెడ్డి, రాగాల చంద్రశేఖర్, వెంకటరమణ రెడ్డి, ఝసువా, ప్రమీల, పద్మ, ప్రేమ్, గోవర్ధన్, గోపి, తేజ్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Sridhar Verma’s brother-in-law Vasu Deva Verma joins YSRCP

Post Midle