Natyam ad

ధనలక్ష్మి అనే మహిళపై అమానుషంగా దాడి చేసిన శ్రీకాళహస్తి సిఐ అంజుయాదవ్ ను సస్పెండ్ చేయాలి

-ఐద్వా డిమాండ్

బద్వేలు ముచ్చట్లు:

శ్రీకాళహస్తి పట్టణంలో సెప్టెంబర్ 30 వతేది రాత్రి ధనలక్ష్మి అనే మహిళపై దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన సీఐ అంజు యాదవ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా  జిల్లా కమిటీ సభ్యురాలు గౌతమి, పట్టణ అధ్యక్షురాలు అనంతమ్మలు సంయుక్తంగా మాట్లాడుతూ….. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో సిఐ అంజు యాదవ్ గారు శృతిమించి ప్రవర్తించరని, ఆపరేషన్ చేసుకున్న మహిళ అనే విషయం మరచి  నడిరోడ్డుపై దురుసుగా వ్యవహరించి,అంతటితో ఊరుకోకుండా ఆ మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టడం దుర్మార్గమైన చర్యఅని ఈ ఘటనకు బాధ్యులైన సిఐ అంజు యాదవ్  ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

Post Midle

శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామనగర్ కాలనీ సమీపంలో హరి, ధనలక్ష్మి దంపతులు హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి 10గంటల తరువాత శ్రీకాళహస్తి 1వ పట్టణ సీఐ అంజూయాదవ్ తన సిబ్బందితో కలసి హరి హోటల్ వద్దకు వెళ్లారు. హోటల్ నిర్వాహకుడు హరి గురించి సీఐ అంజూయాదవ్ అడిగారు. ఈ సందర్భంగా ఆయన ఎక్కడ వెళ్లాడో తనకు తెలియదని హరి భార్య ధనలక్ష్మి చెప్పింది. హరి తప్పించుకు తిరుగుతున్నారని సీఐ అంజూయాదవ్ ఈ సందర్బంగా ధనలక్ష్మికి తెలియచేసింది. అంతటితో ఊరుకోకుండా రాత్రి 10గంటలు దాటినా హోటల్ ఎందుకు నిర్వహిస్తున్నారని ధనలక్ష్మిని హెచ్చరించింది. ఈ సందర్భంగా  సీఐ అంజూయాదవ్, ధనలక్ష్మికి మధ్య మాటలు పెరిగాయి. దీంతో అంజాయాదవ్ కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తననే మర్యాద లేకుండా మాట్లాడుతావా..? అంటూ ధనలక్ష్మిని బలవంతంగా తోసుకుంటూ పోలీసు వాహనం ఎక్కించడానికి ప్రయత్నించింది. ధనలక్ష్మి భయపడి పోలీసు వాహనం ఎక్కకుండా భోరున విలపించినా… అంజూయాదవ్ పట్టించుకోకుండా, తాను నెల రోజుల కిందటే పెద్ద ఆపరేషన్ చేసుకున్నానని… తాను ఏం తప్పు చేశానని స్టేషన్ తీసుకెళుతున్నారని..

 

 

. తనను వదలి పెట్టాలని ధనలక్ష్మి వేడుకున్నప్పటికీ సీఐ అంజూయాదవ్ కరుణించ కుండా ధనలక్ష్మిని బలవంతంగా తోసుకుంటూ ఈడ్చుకుంటూ బట్టలు ఊడిపోతున్న పట్టించుకోకుండా, నెట్టుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనం ఎక్కించారు. ఆమె రోదనలు పోలీసులు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ధనలక్ష్మిని శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ ఆమెపై లాఠీలు ఝుళిపించారు. ధనలక్ష్మిపై గంజాయి, అక్రమ మద్యం కేసు పెట్టడానికి ప్రయత్నించారు. తనను చంపినా సంతకం పెట్టనని ధనలక్ష్మి మొండికేసింది. ఆ తర్వాత ఎట్టకేలకు ధనలక్ష్మిని రాత్రి 2 గంటల సమయంలో పోలీసులు విడిచిపెట్టారు. ధనలక్మి వెంట వెళ్లిన పదవ తరగతి చదివే ఆమె కొడుకుకు కూడా పోలీసు లాఠీ తో కొట్టడం జరిగింది. ధనలక్ష్మి ప్రస్తుతం తిరుపతి రుయాలో చికిత్స పొందుతోంది. ధనలక్ష్మిపై శ్రీకాళహస్తి 1వ పట్టణ సీఐ అంజూయాదవ్ చేసిన దౌర్జన్యాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) బద్వేలు పట్టణ కమిటీ  ఖండిస్తున్నది. ఆమెపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని, ధనలక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ నాయకురాళ్లు గోవిందమ్మ,ఆఫ్రిన్, రమాదేవి,నారాయణమ్మ, లక్ష్మీదేవి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Srikalahasti CI Anjuyadav should be suspended for brutally assaulting a woman named Dhanalakshmi

Post Midle

Leave A Reply

Your email address will not be published.