చురుగ్గా సాగుతున్న శ్రీకాళహస్తి ఎలక్ట్రోస్టీల్‌కాస్టిక్‌ పైపుల ఫ్యాక్టరీ పనులు

-రూ.200 కోట్లతో చురుగ్గా నిర్మాణ పనులు
– 1000 మంది నిరుద్యోగులకు ఉపాధి
– మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ల కృషి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని ఆరడిగుంటలో సుమారు 106 ఎకరాల్లో శ్రీకాళహస్తి ఎలక్ట్రోస్టీల్‌కాస్టిక్‌ పైపుల ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లు కలసి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పడమట కరువు ప్రాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో సాగునీరు-తాగునీరుతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ పారిశ్రామిక కారిడార్‌కు సుమారు 2000 వేల ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు నిర్మించడంతో పరిశ్రమలకు అవసరమైన నీరు సమకూర్చడంలో మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి సఫలికృతులైయ్యారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పనులు ప్రారంభం…

మార్చి 24న రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , ఫ్యాక్టరీ ఎండీ ఉమాసింగ్‌క్రేజివాల్‌తో కలసి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం భూమిని చదును చేసి , 12 అడుగుల ఎత్తు గల ప్రహారీని ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఫ్యాక్టరీకి అవసరమైన 133 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు చేపట్టారు.

నిరుద్యోగులకు ఉపాధి…

ఆరడిగుంట వద్ద నిర్మిస్తున్న పైపుల ఫ్యాక్టరీని సుమారు రూ.200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ కంపెనీలో 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నది. ఈ ప్రాంతంలో జర్మన్‌ పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల కంపెనీ కూడ రావడంతో మరో 10 వేల మందికి ఉపాధి లభించనున్నది. నియోజకవర్గంలో విద్యుత్‌, నీరు, ముడిసరుకు కావాల్సినంత పుష్కలంగా లభిస్తున్నందున పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైంది. అలాగే పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలను మంత్రి పెద్దిరెడ్డి అందిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావడం గమనార్హం.

రియల్‌ భూం….

మండలంలోని ఆరడిగుంట, మేలుందొడ్డి, వనమలదిన్నె ప్రాంతాలతో పాటు పలమనేరు నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ ప్రాంతంలో శ్రీకాళహస్తి పైపుల ఫ్యాక్టరీతో పాటు 800 ఎకరాలలో రూ. 4.640 కోట్లతో జర్మన్‌ పెప్పర్‌ కంపెనీ ఎలక్ట్రికల్‌ బస్సులు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు, కర్నాటకాకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఈ ప్రాంతంలో భూముల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. అన్ని విధాల నియోజకవర్గం పరుగులు తీస్తోంది.

పరిశ్రమల లోటు తీర్చాలని….

పడమట నియోజకవర్గాలలో పరిశ్రమలు లేక వేలాది మంది నిరుద్యోగులు బయట ర్ఖా•లకు వెళ్తున్నారు. నిరుద్యోగులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నాం. దేశ స్థాయిలో పుంగనూరుకు పేరుప్రతిష్టలు రావడంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిది. ఆయనకు కృతజ్ఞతలు.

– డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర విద్యుత్‌, అటవీ, గనులశాఖమంత్రి.

ప్రణాళికలతో ఏర్పాటు…

పుంగనూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో, ప్రజల సహకారంతో పుంగనూరును పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేసి , అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తాం.


– పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట.

  

Tags: Srikalahasti Electrosteel Caustic Pipes Factory is in full swing

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *