శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు.
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
రేణిగుంట మండలం,గుత్తివారి పల్లి గ్రామంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సుమారు 30 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరిన వారిలో కృష్ణారెడ్డి,గురవయ్య,హేమాద్రి రెడ్డి,సుధాకర్ రెడ్డి,చీరాల రెడ్డి, నాగభూషణం రెడ్డి,కోదండపాణి రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి,చంగల్ రాయులు, వాసుదేవరెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేద ప్రజలకు చేస్తున్న సేవా ఆలాగే శ్రీకాళహస్తిని అభివృద్ధి పదంలో నడపడం కోసం అనునిత్యం శ్రమిస్తున్న మధుసూదన్ రెడ్డి కి మేమందరం తోడుగా ఉండడం కోసం నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల నాయకులు మునిరెడ్డి, ధనంజయ రెడ్డి,సుబ్రమణ్యం యాదవ్ మరియు నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags; Srikalahasti is a force of migration from Telugu Desam Party to YSR Congress Party.
